జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం...
పలుప్రాంతాల్లో పంట నష్టం...
ఉట్నూర్, అక్టోబర్ 07 (విజయక్రాంతి): ఈదురుగాలుల వల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట, ఆస్తి నష్టం(Crop and Property Damage) జరిగింది. ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్గావ్ లో బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. డోంగర్ గావ్ నుండి శివ గూడా వెళ్లే రహదారిలో చెట్లు నేలకొరిగాలు. డోంగర్గావ్ గ్రామానికి చెందిన అర్క షెడ్మారావు, పెందూర్ గోవిందరావు, పేందూర్ హనుమంత రావు లకు చెందిన ఇండ్ల పై కప్పు రేకులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి.
వర్షంతో తినుబండారాలు తడిచిపోయాయి. ఈదురు గాలులతో పత్తి నేల కరిగింది. డోంగర్ గావ్ పంచాయతీ పరిధిలోని విద్యుత్ తీగలు తెగి పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈదురు గాలులతో రైతులకు నష్టం జరిగింది. మూడు ఇండ్లలో పై కప్పులు రేకులు ఎగిరిపోవడంతో మూడు కుటుంబాలకు నష్టం జరిగింది. ఈదురుగాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రజలకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.