రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో మహేంద్ర హిల్స్ అకాడమీకి 6 పతకాలు
ఘట్ కేసర్, నవంబర్ 3 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి అంకుషాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(Social Welfare Residential Degree College for Women) మహేంద్ర హిల్స్ హ్యాండ్‌బాల్ అకాడమీ క్రీడాకారిణులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించిన 48వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 6 పతకాలు సాధించారు.
ఈ పోటీల్లో మీనాక్షి, నందిని, శ్రీలత, సాయి ప్రసన్నలు బంగారు పతకాలు సాధించగా, కీర్తన రజత పతకం, అఖిల కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా నాలుగు బంగారు, ఒక రజత, ఒక కాంస్య పతకంతో అకాడమీ క్రీడాకారిణులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి, స్పోర్ట్స్ ఇన్‌చార్జి సవిత, అధ్యాపక బృందం హ్యాండ్ బాల్ కోచ్ పద్మిని గుప్తా అభినందించారు.