కరువు జిల్లాగా మానుకోట ను ప్రకటించాలి
- తక్షణమే కరువు పనులు చేపట్టాలి
- కలెక్టరేట్ ను ముట్టడించిన సీపీఐ
మహబూబాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాను(Mahabubabad District) పూర్తిగా కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ(CPI) ఆధ్వర్యంలోమంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులకు సీపీఐ నేతలకు తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలోని ఏడు మండలాలనే కరువు మండలాలుగా, ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. జిల్లాను పూర్తిగా కరువు జిల్లాగా ప్రకటించి, వ్యవసాయ కూలీలను(Agricultural laborer) ఆదుకోవాలని, మున్సిపాలిటీల్లో(Municipality) కరువు పనులు చేపట్టాలన్నారు.