పిల్లలే దేశ భవిష్యత్తు

14-11-2026 | 06:22pm

ములకలపల్లి,నవంబర్ 14 (విజయక్రాంతి): నేటి పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు అని వారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం(Education, Health),అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్(Jagannadhapuram Sarpanch Kunja Vinod) చెప్పారు.ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Gram Panchayat Office) శనివారం భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంజా వినోద్ పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.చిన్నారుల చిరునవ్వుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొంటూ విద్యార్థులను ప్రోత్సహించారు.

అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది చిన్నారుల పై మరింత శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ సునీష్, ములకలపల్లి మండల కాంగ్రెస్ బియల్ఎ కోఆర్డినేటర్ సురభి రాజేష్,వార్డు సభ్యులు పిడియాల వెంకటేశ్వర్లు,బైటి వెంకటలక్ష్మి,అంగన్వాడీ టీచర్లు సూపర్ వైజర్ మరీదు,రాం సురేష్,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు