చేగుంటలో విషాదం.. మాజీ జడ్పీటీసీ ఆకుల సిద్దిరాములు కన్నుమూత
నివాళులు అర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
చేగుంట నవంబర్ 14,విజయక్రాంతి : చేగుంట మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల సిద్దిరాములు మృతి(Death of Akula Siddiramulu) చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన గతంలో మూడు పర్యాయాలు ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు విశేష సేవలందించారు.
సర్పంచ్‌గా, జడ్పీటీసీగా పనిచేసిన సమయంలో గ్రామ అభివృద్ధికి(Village Development), ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి(Congress Party), చేగుంట ప్రాంతానికి తీరని లోటని దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం అతని భౌతికాయాన్ని డప్పు చప్పులతో కుల మతాలకు అతీతంగా గ్రామస్తులు అంతిమయాత్ర నిర్వహించారు.