సర్వజ్ఞ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఖమ్మం ఎడ్యుకేషన్ విజయక్రాంతి:- ఖమ్మం(Khammam) నగరంలోని వి.డి.ఓస్ కాలనీలో గల సర్వజ్ఞ విద్యాసంస్థల్లో(Sarvajna Educational Institution) నవంబర్ 14న బాలల దినోత్సవ వేడుకలను(Childrens Day celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు, పాటలు, స్కిట్లు, ప్రసంగాలు, ర్యాంప్ వాక్, ఇన్స్ట్రుమెంటల్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. రోబో వేషధారణ, వివిధ రాష్ట్రాల సంప్రదాయ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆర్.వి. నాగేంద్ర కుమార్, డైరెక్టర్ కె. నీలిమ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ, మంచి విలువలు అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.