నేతాజీ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
14-11-2026 | 06:42pm
గణపురం,నవంబర్ 14 (విజయక్రాంతి): మండలంలోని బస్వరాజుపల్లి శ్రీ నేతాజీ హైస్కూల్లో(Sri Netaji High School, Basavarajupalli) బాలల దినోత్సవం, స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు శనివారంఘనంగా నిర్వహించారు. స్వయం పరిపాలన దినోత్సవంలో(Self-Governance Day) విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.