నర్సాపురంలో రీ సర్వే పనుల పరిశీలన
14-11-2026 | 06:33pm
తరిగొప్పుల, నవంబర్ 14 (విజయక్రాంతి) : తరిగొప్పుల మండలంలోని(Tarigoppula Mandal) నర్సాపురం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని(Re-survey program) అదనపు కలెక్టర్ (రెవెన్యూ శాఖ) సందర్శించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్శనలో సహాయ సంచాలకులు (సర్వే, భూమి రికార్డులు(Survey, Land Records)), తరిగొప్పుల తహసీల్దార్, జిల్లా పరిశీలకులు, సర్వే బృందాలు పాల్గొన్నారు.