మాజీ మావోయిస్టు నేత కుటుంబానికి దొడ్డ బాలాజీ పరామర్శ
ముత్తారం, నవంబర్ 13(విజయక్రాంతి): మండలంలోని రామయ్యపల్లె గ్రామానికి(Ramayyapalle village) చెందిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నాయకుడు ఆరెల్లి కొమురయ్య గౌడ్ తల్లి ఆరెల్లి గట్టుమల్లు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ముత్తారం మండల(Muttaram Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడవి శ్రీరాంపూర్ ఉపసర్పంచ్ అనవేని హరిత తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్కం ప్రభాకర్, గట్టు సదయ్య, వార్డు సభ్యుడు వీరబోని అజయ్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.