విదేశీ సంస్కృతుల ప్రభావానికి లోనుకావద్దు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్
భూపాలపల్లి (రేగొండ), నవంబర్ 14 (విజయక్రాంతి): విదేశీ సంస్కృతుల(foreign cultures) ప్రభావానికి లోనుకాకుండా మన సంప్రదాయాలను పాటిస్తూ, స్వీయ సంరక్షణతో జాగ్రత్తగా జీవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్(District Principal Judge J. Jeevan Kumar) సూచించారు. రేగొండ కేజీబీవీ పాఠశాలలో(Regonda KGBV School) జిల్లా న్యాయసేవాధికార సంస్థ(District Legal Services Authority) ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో(Children's Day) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు(Students) బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ
కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి మనోరమ, ఎస్సై హేమలత, సూపరింటెండెంట్ రఘురామ్, కోర్టు సిబ్బంది అంబాల దేవేందర్, రమేష్, రాజ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.