సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వరి కోత ప్రారంభం

14-11-2026 | 06:20pm

గణపురం, నవంబర్ 14 (విజయక్రాంతి): భద్రాచలంలో(Bhadrachalam) వైభవంగా జరిగే శ్రీ సీతారాముల(Sri Sita and Rama) కల్యాణంలో వినియోగించే కోటి తలంబ్రాల కోసం పండించిన వరి పంట(Paddy crop) కోతను శనివారం ప్రారంభించారు. శ్రీ రామదాసు(Sri Ramadasu) భక్తమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో సాగు చేసిన ఈ పంటను భక్తమండలి వ్యవస్థాపకులు చెల్పూర్ గ్రామానికి(Chelpur village) చెందిన తిరుపతమ్మ, తిరుపతి దంపతుల వ్యవసాయ క్షేత్రంలో భక్తులు(devotees), మహిళా భక్తులు(devotees) కలిసి కోశారు. రెండు రోజుల పాటు భక్తిగీతాల మధ్య కోత కొనసాగనుంది. అనంతరం ధాన్యాన్ని భక్తులకు(devotees) పంపించి, చేతితో ఒలిపించి సీతారాముల కల్యాణంలో తలంబ్రాలుగా వినియోగించనున్నారుగత 11 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు  తెలిపారు.

మరిన్ని వార్తలు