ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
భూపాలపల్లి, టౌన్ నవంబర్ 14 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు(National Library Week Celebrations) శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, సీఐ శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ లు పాల్గొని డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్, చాచా నెహ్రూ(Chacha Nehru) చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని వారు సూచించారు. వారోత్సవాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ
కార్యక్రమంలో కౌన్సిలర్లు ఓరుగంటి రాధ, మేఘన శ్రీనివాస్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ నాగపురి సమ్మయ్య గౌడ్, ఎం.డి. అహ్మద్, కుసుమ కృష్ణమోహన్, సంస్థ కార్యదర్శి ఎం. రాజేంద్ర ప్రసాద్, లైబ్రేరియన్లు కృష్ణ, శారద, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.