రైతును నట్టేట ముంచిన మురసు తుఫాన్
- వేయి ఎకరాల వరి నీటి పాలు
- దెబ్బతిన్న కూరగాయల పంట
- గండ్లు పడిన చెరువులు, రోడ్లు
అశ్వారావుపేట, నవంబర్ 5 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన మురసు తుఫాన్(Cyclone Murasu) రైతులను నట్టేట ముంచింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగి, లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వేయి ఎకరాల వరి, వందల ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం వరకు అశ్వారావుపేట మండలం లో 278.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుఫాన్ కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది.
పెద్ద వాగు ప్రాజెక్ట్ భారీగా వరద నీరు రావడంతో, రెండేళ్లు క్రితం మూడు మీటర్ల ఎత్తున నిర్మించిన తాత్కాలిక రింగ్ బండ్ కు గండిపడింది. ప్రాజెక్ట్ దిగువు గ్రామాలు ముంపుకు గురవుతాయి అని ఆందోళన చెందిన గుమ్మడ వల్లీ గ్రామస్తులు గ్రామంలోకి నీరు చేరకపోవడం బతికిపోయాము రా దేవుడా అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ కింద ఉన్న సుమారు 200 ఎకరాల పైనే వరి పంట నీట మునిగింది. దీంతో పాటు మిర్చి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పామాయిల్ మొక్కలు కూడా వాలిపోయాయి. మం డలంలో ఉట్ల పల్లి సమీపం లోని వెంకమ్మ చెరువుకు 40 సంవత్సరాల క్రితం 1986 లో గండి పడింది. మరల 2026లో వెంకమ్మ చెరువుకు గండి పడింది.
అచ్యుతాపురంలోని చెన్నయ్య కట్ట, నారంవారిగుడెం సమీపంలోని సాగరం చెరువులకు గండ్లు పడ్డాయి. మండ లంలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. అశ్వారావుపేట పట్టణంలో గుర్రాల చెరువు రోడ్, సాయి నగర్, దూదేకుల బజార్, శివయ్య గారి వీధితోపాటు పాలు కాలనీలు నీట మునిగాయి. కొన్ని ఇళ్ల లోకి వరద నీరు చేరింది. మండలపల్లి నుండి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. మురుసు తుఫాన్ రోడ్లు, చెరువులు నాదినం చేయడమే కాకుండా రైతులను నట్టేట ముం చింది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.