ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి, టపాకాయలు కాల్స్ సీట్లు పంచి పెట్టిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి
కామారెడ్డి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి టపాకాయలు పేజీ సీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిండ్ల అంజయ్య, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గడ్డం హిందూ ప్రియ, ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీ పిడుగు మమత, జిల్లా సేవ దళ్ అధ్యక్షులు గడ్డ మీది మహేష్, డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్ ,సబ్బని కృష్ణాహరి, డిసిసి జనరల్ సెక్రెటరీ నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్, సేవల నియోజకవర్గ అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమీల్ అహ్మద్, సలీం, సుగుణ, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, క్రీడా అధ్యక్షులు లక్ష్మీ నరస గౌడ్, సునీల్ గౌడ్, బండారి శ్రీకాంత్, అరవింద్, ఆబిద్, యూత్ నాయకులు రాహుల్, శశి, మున్నా, పండు శ్రీకాంత్, ఆకాష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.