అయ్యప్ప స్వాముల విజ్ఞప్తికి స్పందన
రామాలయానికి బోరుబావి.. పుష్కలంగా నీరు!
మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా
శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట గ్రామం(Shivampet village)లోని పురాతన రామాలయానికి వచ్చే భక్తులతో పాటు అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రముఖ సంఘసేవకులు, తాజా మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా(Former ZPTC Pabba Mahesh Gupta) బోరుబావి తవ్వించారు. అయ్యప్ప స్వాముల విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి బోరుబావి ఏర్పాటు చేయగా, పుష్కలంగా నీరు పడటంతో భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ, భక్తుల అవసరాలను గుర్తించి మంచినీటి సౌకర్యం కల్పించిన పబ్బ మహేష్ గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన సేవలను అభినందించారు.