ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్ ప్రత్యేక గుర్తింపు కల్పించారు
మాజీ మంత్రి జోగు రామన్న.. గుస్సాడీ కళాకారులతో కలిసి నృత్యం
బేల,(విజయక్రాంతి): ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కేసీఆర్(KCR) ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న)Former Minister Jogu Ramanna_ అన్నారు. శుక్రవారం బేల మండలంలోని గణేష్‌పూర్, సదల్‌పూర్ గ్రామాల్లో నిర్వహించిన గుస్సాడీ దండారి ఉత్సవాల్లో(Gussadi Dandari Festivals) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికి సత్కరించారు.
అనంతరం గుస్సాడీ కళాకారులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జోడేఘాట్‌లో కొమురం భీమ్‌కు అధికారిక నివాళుల కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు రూ.25 కోట్లతో మ్యూజియం నిర్మించారని గుర్తు చేశారు. ఆదివాసీలకు భూ పట్టాలు, రైతుబంధు, ప్రత్యేక గ్రామపంచాయతీలు, గుస్సాడీ బృందాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఎక్కడ ఉన్న ఎంపీ , ఎమ్మెల్యే ఎందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎలినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.
రైతులను ఆదుకోవాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడుతూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, సతీష్ పవర్, దేవన్న, అరుణ్, విపిన్ కోడె, మస్కే తేజరావు, అఖిల్, మురళీధర్, కుషాల్ రావు, సర్పంచ్ మంగేష్, జవంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.