మిడ్జిల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అధికారుల ప్రత్యేక దృష్టి
09-11-2026 | 03:10pm
24 గ్రామ పంచాయతీల బీఎల్‌ఓలతో పెండింగ్ పనులపై సమీక్ష
మిడ్జిల్: మిడ్జిల్ మండలం(Midjil Mandal)లోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో బూత్ లెవల్ అధికారులు(Booth Level Officers) (బీఎల్‌ఓలు) చేపడుతున్న ఎస్‌ఐఆర్ సంబంధిత పనులపై సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డి(Tahsildar Raghavender Reddy), ఎంపీడీవో లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఎల్‌ఓల పెండింగ్ పనుల వివరాలను సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు చెందిన బీఎల్‌ఓలు పాల్గొన్నారు.