లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
చార్జి షీటు వేయడానికి రూ.2 లక్షలు డిమాండ్
రెండు నెలల్లో ఏసీబీ వలలో సీఐ, ఇద్దరు ఎస్ఐలు
మేడ్చల్,(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్(Keesara Police Station)లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ లంచం(Bribe) తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. చార్జిషీట్ వేయడానికి రూ. రెండు లక్షలు డిమాండ్ చేయగా, బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. నాగారంలోని శిల్ప నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో రెండు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కీసర పోలీస్ స్టేషన్లో ఎస్సై ఏసీబీ(ACB)కి చిక్కడం కలకలం రేపుతోంది. అక్టోబర్లో ఐదు లక్షలు లంచం తీసుకుంటూ సిఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి దొరికిన ఘటన మరువక ముందే ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుబడడం విస్మయం కలిగిస్తోంది. ఇటీవలే ఏసీబీకి సీఐఎస్ఐ దొరికినప్పటికీ మళ్లీ పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడం బట్టి చూస్తే ఏసీబీకి దొరికితే ఏమవుతుందిలే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.