నిరుపేద చిన్నారులకు విద్యా భరోసా
అశ్వాపురం, నవంబర్ 28 (విజయక్రాంతి): పేదరికం విద్యకు అడ్డుకాకూడదనే సంకల్పంతో దానధర్మ ట్రస్ట్ చైర్మన్ ఘంటా రాధ నిరుపేద చిన్నారుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపుతున్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మామిళ్లవాయిని కేంద్రంగా చేసుకొని వెంకటాపురం, వేములూరు తదితర గ్రామాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులకు ట్రస్ట్ (Trust) ఆధ్వర్యంలో విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
చిన్నారులకు పుస్తకాలు, దుస్తులు, పలకలు, బోధనా సామగ్రితోపాటు భోజన వసతి (Food Facility) కల్పిస్తున్నారు. వారి చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడనే లక్ష్యంతో తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు భరోసా (Educational Support) కల్పిస్తున్నారు.
మారుమూల గ్రామాల్లోని నిరుపేద చిన్నారులకు విద్యా అవకాశాలు అందిస్తూ ఘంటా రాధ చేస్తున్న సేవలు (Social Service) పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆమె సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.