పాల్వంచలో రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

10-11-2026 | 11:36pm

​పాల్వంచ, నవంబర్ 10 (విజయక్రాంతి): పాల్వంచ(Palwancha) నెహ్రూ నగర్‌కు చెందిన పగిళ్ల శోభ(39) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ​పోలీసులకు బాధితురాలి కుమారుడు అందించిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... నవంబర్ 09న సాయంత్రం సమయంలో శోభ నెహ్రూనగర్‌లోని చౌక దుకాణంలో రేషన్ బియ్యం తీసుకుని, మెయిన్ రోడ్డు పక్కన దమ్మపేట సెంటర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

సాయంత్రం సుమారు 05:00 గంటల సమయంలో సాయి సుధా హాస్పిటల్ ఎదురుగా వస్తుండగా, భద్రాచలం వైపు నుండి కొత్తగూడెం వైపు వస్తున్న అశోక్ లేలాండ్ DCM వ్యాన్ (నెం. TS 11 UB 9398) డ్రైవర్ సన్నేనా రాము అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుతూ శోభను వెనుక నుండి ఢీకొట్టాడు.

​ఈ ప్రమాదంలో ఆమె రోడ్డు మీద పడిపోగా, లారీ ముందు టైరు ఆమె పైనుండి వెళ్లడంతో నోటి నుండి, ముక్కు నుండి తీవ్ర రక్తస్రావమై సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అక్కడున్న స్థానికులు ఆమెను వెంటనే అంబులెన్స్ ద్వారా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. ​ప్రమాదానికి కారణమైన DCM వ్యాన్ డ్రైవర్ సన్నేనా రాము(34)పై తగు చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమారుడు పగిళ్ల మనోజ్ పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు