కిరాణా షాపులను తనిఖీ చేసిన తహసిల్దార్
10-11-2026 | 11:04pm
తహసిల్దార్ వేణుగోపాల్
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 10, (విజయక్రాంతి): వెంకటాపురం మండల కేంద్రంలోని కిరాణా షాప్ లలో బెల్లం, పంచదార, పట్టిక నిల్వలపై తహసీల్దార్ వేణుగోపాల్ అధ్యర్యంలో మంగళవారం సాయంత్రం తనిఖీ నిర్వహించడం జరిగింది. నిత్యా అవసరాలకు ఉపయోగ పడే నిల్వలు మాత్రమే ఉండడం జరిగింది. బెల్లం, పంచదార, పట్టిక నిల్వ అక్రమంగా ఉన్నాయెడల, అమ్మకాలు చేసిన చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఆర్. ఐ విష్ణువర్ధన్, జిపిఓ లు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పాల్గొనడం జరిగింది.