ఇథనాల్ పరిశ్రమతో అనర్థాలు

10-11-2026 | 11:24pm

ప్రజలకు అవగాహన..

దామరచర్ల నవంబర్ 10: ఇథనాల్ పరిశ్రమ(Ethanol Plant) ఏర్పాటుతో చోటుచేసుకునే అనర్థాలపై దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో మంగళవారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కన్నెగంటి రవి, సామాజిక కార్యకర్తలు బండారు లక్ష్మయ్య, రామయ్యల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 20 వతేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వివిధ సమస్యలపై బలంగా మీ వాణి వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు