న్యాయం చేయకపోతే ఉప ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటాం
మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరిక..
హనుమకొండ, నవంబర్ 10 (విజయక్రాంతి): వైఎస్ఆర్ నగర్ గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని, ఆ స్థలం పేదలకు దక్కేలా చర్యలు చేపట్టాలని, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(Former MLA Dasyam Vinay Bhaskar) అన్నారు. వైయస్సార్ నగర్ గుడిసె వాసులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు.
కాజీపేట ప్రెస్ క్లబ్ లో మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులతో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దాస్ భాస్కర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ గుడిసె వాసుల తరపున పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులు తొలగించాలన్నారు. బుధవారం వరంగల్ పర్యటనకు వస్తున్నా డిప్యూటీ సీఎం భట్టి ని విక్రమార్కని ఉద్దేశించి మాట్లాడుతూ... 30 ఏండ్ల క్రితం కాంగ్రెస్ నాయకులే కాజీపేటలో సీలింగ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి కాంగ్రెస్ నాయకులే ఇక్కడ పేదలతో గుడిసెలు వేసేలా చేశారని, అదే కాంగ్రెస్ నాయకులు గుడిసె నుంచి వెళ్లగొట్టి ప్రజలను ఇబ్బందుల గురిచేస్తున్నారన్నారు.
అక్కడ బస్టాండ్ నిర్మాణం కావాలని నాటి పాలకులు, అధికారులు ప్రకటించారని,ఆ గుడిసెవాసులకు బీఆర్ఎస్ హయాంలో ఏ ఇబ్బంది కలగనివ్వలేదన్నారు.ఈ స్థలం విషయంలో ఎమార్వో కు టిఆర్ఎస్ తరఫున వినతిపత్రం ఇచ్చి వారం గడిచిన ఇప్పటికి సమాధానం లేదన్నారు.కాజీపేట ప్రజల రవాణా సౌకర్యం కోసం బ్రిడ్జి నిర్మాణం కోసం 76 కోట్ల నిధులు తెచ్చి, 80 శాతం పనులు చేశామని,నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట బ్రిడ్జి నిర్మాణాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తాను అని, 100 పోయి మూడు ఏండ్లు పూర్తి కావస్తోంది ఎందుకు పూర్తి చేయలేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భట్టి పర్యటన పూర్తి అయ్యేలోపు పేదలకు న్యాయం చేయాలి లేదా వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసు లకు పట్టాల పంపిణీపై సమాధానం రాకపోతే వారి పర్యటనను అడ్డుకుంటాంఅని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్లగిరి రమేష్, సుంచు కృష్ణ, మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, గబ్బేట శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్, బేధరకోట రంజిత్, కుమ్మరి కోటిలింగం, కాటపురం రాజు, బస్వా యాదగిరి, ఆఫ్జాల్, మహుముద్, హుస్సేన్, మర్యాల కృష్ణ, బండి చందర్, బరిగెల వినయ్, పడిదెల శేఖర్, మాతంగి మెహన్, మంద శ్రీనివాస్, జన్ను శంకర్ తదితరులు పాల్గొన్నారు.