అదుపుతప్పి బోల్తా పడ్డ ఆటో
10-11-2026 | 11:01pm
10 మందికి గాయాలు..
జగిత్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): మెట్ పల్లి(Metpally) పట్టణంలోని ఆరపేట శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటనలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జగిత్యాల, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామం నుండి మెట్ పల్లి పట్టణంలోని రేగుంటలో ఒక ఫంక్షన్ కు హాజరయ్యేందుకు ఆటోలో వస్తున్నట్లు సమాచారం. మెట్పల్లి సీఐ సురేష్ బాబు, ఎస్సై పబ్బ కిరణ్ ఘటన స్థలంకు చేరుకొని ఘటనకు సంబంధించిన ఆధారాలు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.