ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎంపీ కడియం కావ్య
10-11-2026 | 10:57pm
హనుమకొండ, నవంబర్ 10 (విజయక్రాంతి): హనుమకొండ పట్టణానికి చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా, అతని చికిత్స కోసం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య(Warangal MP Dr Kadiyam Kavya) ప్రత్యేక శ్రద్ధ వహించి రూ.5 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ఓసి నీ మంగళవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపత్కాలంలో తమకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యకి బాధిత కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.