సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన నల్గొండ ఎస్పీ
10-11-2026 | 11:27pm
నల్లగొండ నవంబర్ 10 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar) సైబర్ నేరాల నివారణ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని, www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి. రమేష్, సైబర్ క్రైమ్స్ డీఎస్పీ టి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.