ఇంకుడుగుంతలతో భూగర్భ జలాల పెంపు
ములకలపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కొత్తగూడెం డిజైనర్ డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్(Kothagudem Divisional Panchayat Officer Prabhakar) కోరారు. మంగళవారం మండలంలోని సీతారాంపురం పంచాయతీ సుబ్బనపల్లి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను ముగ్గు బోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వృధాగా పోతున్న నీటిని ఇంకుడు గుంతలకు మరల్చి భూగర్భ జలాలను సంరక్షించాలని సూచించారు.
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని చెప్పారు. ఒక ఇంకుడు గుంత నిర్మాణానికి విబిజి రామ్ పథకం ద్వారా 6800 నగదు అందజేయడం జరుగుతుందని ప్రతి కుటుంబం ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంజా రవి, మండల పరిషత్ అధికారి రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ తాటి ప్రసాద్ పంచాయతీ సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.