భద్రాద్రి డి.ఏ.వి హైస్కూల్ కు రాష్ట్రస్థాయి ఖ్యాతి

05-11-2026 | 09:54pm

మణుగూరు, నవంబర్ 05(విజయ క్రాంతి ): తెలంగాణ జెన్‌కో(Telangana Genco) పరిధిలోని వివిధ డి.ఏ.వి విద్యాలయాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయుల బృందం బుధవారం భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(Bhadradri Thermal Power Station) టౌన్‌షిప్‌లోని డి.ఏ.వి హైస్కూల్‌ను సందర్శించింది. చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న  సారథ్యంలో, ఎస్.ఇ (సివిల్), ఎస్.ఇ (అడ్మిన్) గార్ల పర్యవేక్షణలో నిర్మితమైన అత్యాధునిక భవనం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, విశాలమైన ఆట స్థలం, పార్కింగ్ సౌకర్యాలను బృందం పరిశీలించారు.

దేశ స్థాయిలో ఏ కార్పొరేట్ స్కూల్ కైనా దీటుగా ఉన్న ఇక్కడి బోధనా విధానాలు, మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలకు ఆదర్శమని బృందం కొనియాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి సి.బి.ఎస్.ఇ సిలబస్ రానుండటంతో భద్రాద్రి ఉద్యోగుల పిల్లలు అదృష్టవంతులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన చీఫ్ ఇంజనీర్ శ్రీ బిచ్చన్న గారిని బృంద సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు.

మరిన్ని వార్తలు