ఆర్ఓఆర్ రిజర్వేషన్లు అమలు చేయాలి
సింగరేణి డైరెక్టర్ గౌతమ్ ను కలసిన చిలుక రాజనర్సు
బెల్లంపల్లి: సింగరేణి డైరెక్టర్(Singareni Directors) పా గౌతమ్ పోట్రూ, డైరెక్టర్ (పీ పీ)వెంకటేశ్వర్లను సింగరేణి భవన్ లో ఇవాళ జిల్లా SC,ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్(District SC/ST Atrocities Vigilance and Monitoring Committee) సభ్యులు చిలుక రాజనర్సు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణిలో ROR రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు,బ్యాక్ లాగ్ పోస్ట్ లలో అర్హులైన వారిని గుర్తించి నియమించాలని కోరారు.
అలాగే SC వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో నేపధ్యంలో సింగరేణి సంస్థలో కూడా మాదిగ,మాదిగ ఉపకులాలకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్లు అమలు చేయాలనీ కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్టు చిలుక రాజనర్సు తెలిపారు. ఆయన వెంట శాంతిఖని ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి రత్నం ప్రవీణ్ కుమార్ ఉన్నారు.