పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు బహూకరణ
05-11-2026 | 09:45pm
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అవుషాపూర్ కు చెందిన ఓ పేదింటి అమ్మాయి పెళ్లికి ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి వారి సహకారాన్ని అందించారు. అదే గ్రామానికి చెందిన స్వర్గీయ పండ్ల కృష్ణ కుమార్తె వివాహం సందర్భంగా గురువారం వారి ఇంటి వద్ద పుస్తె మెట్టెలు, నూతన వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో అవుషాపూర్ బిజెపి భూత్ అధ్యక్షుడు చిలకమారి మహేశ్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.