భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

05-11-2026 | 09:42pm

సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితులు బయటాయించి భూ కబ్జాదారుల దారులపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం  ఆందోళన చేపట్టారు, మున్సిపల్ కౌన్సిలర్ గరిగే శోభారాణి  శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యుల తో బయటాయించి తమభూమి తమకు కేటాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ తమ భూమి కబ్జా చేశారంటూ అధికార పార్టీకే చెందిన మరో కౌన్సిలర్ గరిగే శోభారాణి శ్రీనివాస్ లు తమ కుటుంబ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఈ విషయంపై గత ఆరు నెలలుగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ మాత్రం స్పందించడం లేదని వారు ఆవేదన వెలిబుచ్చారు, అక్రమ దారునికి ఇంటి నిర్మాణం లేకుండా ఏ విధంగా ఇంటి నెంబర్ ఇచ్చారని వారు మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. ధర్నాలో కూర్చున్న వారు నినాదాలు చేస్తూ కమిషనర్ బయటికి రావాలంటూ పలుమార్లు నినాదాలు చేయగా కమిషనర్ రమేష్ బయటకు వచ్చి మాట్లాడుతూ లీగల్ ఒపీనియన్ కు పంపించడం జరిగింది.

రెండు రోజుల సమయం ఇవ్వండి  అని బాధితులతో మాట్లాడారు, తమకు న్యాయం జరగడంతో పాటు భూ కబ్జాదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, ఆందోళన జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు,.. ఈ ఆందోళన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గరిగె శోభా రాణి శ్రీనివాస్ , గరిగే తిరుమల , సాహిత్ , పోచం, సరోజన లు పాల్గొన్నారు...

మరిన్ని వార్తలు