బ్యాంకు అభివృద్ధిలో పీఏసీఎస్‌ల పాత్ర కీలకం
నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్
ఘనంగా ఎన్డీసీసీబీ మహాజన సభ
నిజామబాద్, నవంబర్ ౩(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(Nizamabad District Cooperative Central Bank)(ఎన్డీసీసీబీ) 104 వ వార్షిక మహాజన సభ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంగళవారం అధికారిక పీఐసీ కమిటీ సభ్యులు, నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ రాజాగౌడ్(B. Rajagoud) అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు నిరంతరం అభివృద్ధి పథంలో పయనిస్తూ, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతున్నందుకు ముఖ్యకార్యనిర్వహణాధికారి, ఉన్నతాధికారులు, సిబ్బందిని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులను ప్రత్యేకంగా అభినందించారు.
బ్యాంకు అభివృద్ధిలో పీఏసీఎస్‌ల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే బ్యాంకు ఆర్థిక పరిస్థితి మహాజన సభకు వివరించారు. సభ్య సంఘాల సహకారంతో ఇటీవల బ్యాంకు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తముగా ఉంటూ నాబార్డ్, టీజీసీఏబీ ద్వారా ఉత్తమ అవార్డు అందుకుందని తెలిపారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి సేవలో సహకార బ్యాంకు ప్రథమ స్థాయిలో ఉందని వివరించారు.
ఈ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) అధ్యక్షులు పాల్గొని బ్యాంకుకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఇటీవల నూతనంగా సహకార సంఘ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్ అధ్యక్షులకు అదనపు కలెక్టర్ బీ రాజా గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆఫీసీయల్ పీఐసీ క మిటీ సభ్యులు, జిల్లా సహకార అధికారి ఎ న్. శ్రీనివాసరావు, కామారెడ్డి జిల్లా సహకా ర అధికారి రామ్మోహన్, బ్యాంకు ఉన్నతాధికారులు, పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.