నాకేం తక్కువ.. పోలీస్ స్టేషన్ ఎక్కడ?

04-11-2026 | 05:35am
  1. గండీడ్ వాసుల పీఎస్ కల నెరవేరేనా?
  2. ఇబ్బంది పడుతున్న 27 గ్రామాల ప్రజలు

గండీడ్, నవంబర్ 3 : గండీడ్ మండలం(Gandeed Mandal) కేంద్రం మాత్రం పోలీస్ స్టేషన్(Police Station) ఏర్పాటు చేయడంలో నాకేం తక్కువ అంటూ ఆ మండలం ప్రశ్నిస్తుంది. దశాబ్దాల కాలం నుంచి 49 గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపుని సొంతం వస్తున్నా... నాపై వివక్ష ఎందుకు? నా పరిధిలోని గ్రామాల ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ చేయాలంటే మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్(Police Station) ఏర్పాటు చేస్తేనే మేలు జరుగుతుందని ఆ మండలం ఆవేదన వ్యక్తం చే స్తుంది.

గండీడ్ మండల కేంద్రం అయినప్పటికీ పోలీస్ స్టేషన్(Police Station) మాత్రం దశాబ్దాల కాలం నుంచి మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ(Mahammadabad Gram Panchayat) పరిధిలోని కొనసాగుతూ వచ్చింది. ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత మహమ్మదాబాద్ మండలాన్ని ఏర్పా టు చేసింది. మండల ఏర్పాటుతో మహమ్మదాబాద్ మండలం పరిధిలోని ప్రజల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం.

పాత మండల కేంద్రంలో మాత్రం నూతన పోలీస్ స్టేషన్ కు అడుగులు పడకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ప్రజా పాలన ప్రభుత్వం చెప్పాలంటూ గండీడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు పోలీసుల సేవలను అందుబాటులో ఉంచాలంటూ ఆయా గ్రామాల ప్రజలు కోరుతుండ్రు.

- అక్రమాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ స్టేషన్ అత్యవసరం..

అక్రమలను అడ్డు కట్ట వేయడంలో పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని నియమ నిబంధనలను అమలు చేస్తూ అడుగులు వేస్తుంటారు. ఏళ్ల తరబడి మండల కేంద్రం ఉన్నప్పటికీ ఆ మండల పరిధిలోనే మహమ్మదాబాద్ ఉండడంతో గండీడ్ మండల ప్రజలు ప్రత్యేక పోలీస్ స్టేషన్ కావాలంటూ ఎప్పుడు కోరలేదు. మహమ్మదాబాద్ మండలం ఏర్పాటు కావడంతో దశాబ్దాల నుంచి సేవలందిస్తున్న గండీడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటుంది. పోలీస్ స్టేషన్ మండల కేంద్రానికి సమీపంలో ఉంటేనే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆ మండల ప్రాంతవాసులు చెబుతున్న మాట. 

- ఎమ్మెల్యే ప్రత్యేక చోరువ తీసుకోవాలంటూ వేడుకోలు 

 దశబ్దల కాలంకంటే ముందే రూపుదిద్దుకున్న గండీడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు పోలీసుల సేవలను మరింత చేరు చేయాలంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని ఆ మండల వాసులు వేడుకుంటుండ్రు. ఎలాగైనా పాత మండలంలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేసి ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ చేయాలని కోరుతుండ్రు. గండీడ్ ఉమ్మడి మండలంలో 46 గ్రామాలు ఉన్నప్పటికీ 3 గ్రామాలు నూతన గ్రామ పంచాయతీలుగా అవతరించాయి. మొత్తం 49 గ్రామాలకు గండీడ్ మండలం సేవలందించింది. కాగా గండీడ్ మండల పరిధిలోనే ఉన్న మహమ్మదాబాద్ గ్రామాన్ని 22 గ్రామాలను కేటాయిస్తూ మండల కేంద్రంగా చేశారు. ప్రస్తుతం 27 గ్రామాలతో గండీడ్ పాత మండలం యధావిధిగా కొనసాగుతుంది. ఈ మండల కేంద్రానికి కూడా నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రతి అవసరానికి మహమ్మదాబాద్ మండల కేంద్రానికి వెళ్లవలసి వస్తుందని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని జనం కోరుతుండ్రు. 

గండీడ్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

27 గ్రామాల ప్రజలు పోలీస్ సేవల కోసం మహమ్మదాబాద్కు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రజల సౌకర్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా గండీడ్ మండల కేంద్రంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సమంజసంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

ఆర్ భగవంత్ రెడ్డి, 

గండీడ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు,

మరిన్ని వార్తలు