పర్యావరణహిత వీడియోలపై రాజకీయాలేంది?
- ఎవరో ఏదో అన్నారని వాటిని తీసేస్తారా?.. మనది లౌకిక దేశం
- దియా మీర్జా దీపావళి వీడియోను తిరిగి అప్‌లోడ్ చేయండి
- బీఎంసీకి బాంబే హైకోర్టు ఆదేశం
- అందరం పీల్చే గాలి ఒక్కటేనన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు
- మంచి పనికి కులం, మతం రంగు పులమడం బాధాకరమని వ్యాఖ్య
ముంబై, నవంబర్ 3: పర్యావరణ(Environment) అనుకూల పటాకులు కాల్చాలని విజ్ఞప్తి చేసిన ప్రముఖ నటి దియా మీర్జా(Actress Dia Mirza) వీడియోను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(Brihanmumbai Municipal Corporation) (బీఎంసీ) తొలగించడంపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. వెంటనే ఆ వీడియోను తిరిగి అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ఎవరో ఏదో అన్నారని పర్యావరణహిత వీడియోలను(Environmentally friendly videos) తొలగించడం బాధాకరమని పేర్కొంది. పర్యావరణాన్ని కాపాడేలా దీపావళి నిర్వహించుకోవాలంటూ ఇటీవల బీఎంసీ కమిషనర్(BMC Commissioner) పలువురు సినీ ప్రముఖులతో వీడియోలు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అందులో దియా మీర్జాతో కూడా ఓ వీడియో చేయించి విడుదల చేశారు. అయితే.. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మహారాష్ట్ర బీజేపీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. హిం దువుల పండుగల గురించి ఎవరో చెప్పాల్సిన పనిలేదని వారు అన్నారు. హిందువుల మనో భావాలు దెబ్బతీసేలా దియా మీర్జా చాలా సార్లు మాట్లాడారని, ఆమె ఇప్పుడు పండుగ గురించి సూక్తులు చెప్పాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం దియా మీర్జా వీడియోను బీఎంసీ తొలగించింది. దీనిపై పలువురు పర్యావర ణవేత్తలు వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ప్రతి వ్యక్తిని గౌరవించాలి
పర్యావరణ పరిరక్షణ, వాయు, శబ్ద కాలు ష్యాల గురించి అవగాహన కల్పించేందుకు రూపొందించిన వీడియోపై కుల, మత, రాజ కీయ వంటి అనవసరమైన వ్యాఖ్యలు దుర దృష్టకరమని జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. లౌకిక స్ఫూర్తిని నిలబెట్టాలని రాజ్యాంగం ఆశిస్తుందని పేర్కొ ంది. పర్యావరణహితంగా దీపావళి పండుగ నిర్వహణ కోసం ప్రముఖులతో వీడియోలు చేయించి విడుదల చేయాలన్న బీఎంసీ కమి షనర్ నిర్ణయం అభినందనీయమని తెలిపింది.
దీనిపై కొందరు వ్యక్తులు వివాదాలను తెరపైకి తేవడం బాధాకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీడియోపై అభ్యంతరం తెలిపిన వారిని ఉద్దేశిస్తూ.. సమాజంలోని ప్రతి వ్యక్తిని వారి మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా గౌరవించాలని స్పష్టం చేసింది. ఈ వీడియోకు కులం, మతం రంగు పులమొద్దని.. మనది లౌకికదేశమని.. అం దరం పీల్చే గాలి ఒక్కటేననే విషయం గుర్తుం చుకోవాలని హైకోర్టు హితవు పలికింది.