కార్యదర్శుల కొరత.. ప్రజలకు వెత
- అస్తవ్యస్థంగా గ్రామ పాలన
- ఇంచార్జీలతోనే సరి
- తండాలకే ఇంచార్జీ లు
సిరికొండ, నవంబర్ 3 (విజయక్రాంతి): గ్రామీణ పరిపాలనకు మూలస్థంబాలైన పంచాయతీ కార్యదర్శిల(Panchayat Secretaries) కొరత సిరికొండ మండలంలో(Sirikonda Mandal) తీవ్ర సమస్యగా మారింది.సరిపడా పంచాయతీ కార్యదర్శులు(Panchayat Secretaries) లేకపో వడంతో గ్రామ పాలన(Village Administration) పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో సేవల కోసం ప్రజలు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణమని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిరికొండ మండలంలో(Sirikonda Mandal) 30 గ్రామ పంచాయతీలు ఉండగా 20 గ్రామ పంచాయతీలకు కార్యదర్శులున్నారు. 10 గ్రామ పంచా యతీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ధూప్య తండా, గోప్య తండా, గోప్యా నాయక్ తం డా, జగదాంబ తండా, జంగిలోడి తండా, స ర్పల్లి తండా, కుర్ధూల్ పేట్, పాకాల,తాటిపల్లి ,మెట్టు తండాలో ఇంచార్జీ కా ర్యదర్శి పాలన సాగుతోంది. వీటిని భర్తీ చేయకపోవడంతో పక్క గ్రామాల పంచాయతీ కా ర్యదర్శి ఇంచార్జీ నియమించి స రిపెడుతున్నారు. ఈ విధానంతోనే గ్రామ పాలన కుంటుపడుతుందనీ విమర్శలు వస్తున్నాయి. తండాలుగా ఉన్న గ్రామ పంచాయతీలకే ఇంచార్జీ కార్యదర్శిలను ఏర్పాటు చేయడమేంటని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు.
పనులు అర్థాంతరమే..
గ్రామ కార్యదర్శులకు రెండు ,మూడు గ్రామ పంచాయతీలు ఇంచార్జీ ఇవ్వడంతో పనులు అర్థాంతరంగానే మిగిలి పోతున్నాయి.సొంత గ్రామ పంచాయతీ పనులు ఎక్కువగా ఉండటంతో , ఇంచార్జీ ఇచ్చిన పంచాయతీలతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. చేసిన పనులు ఆన్లైన్ చేయ డంతో పాటు, అభివృద్ధి కోసం నిర్వహించే సమావేశాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. దీంతో ఇంచార్జీ పంచాయతీల్లో ప్రభుత్వ సే వలు ఆటంకం కలుగుతుందనీ వాపోతున్నా రు. ఇంచార్జీ గ్రామాల్లో కార్యదర్శులు మా ములుగా తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కార్యదర్శి కొరకు నిరీక్షణ
ఇంచార్జీ పంచాయతీల్లో ప్రజలు సేవల కొరకు కార్యదర్శి కొరకు గంటలు,రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందనీ ప్రజలు వాపోతున్నారు. ఫోన్లో సం ప్రదిస్తే వస్తున్న వెయిట్ చెయ్యి పని కావాల ంటే వేచి చూడు అని కొందరు కార్యదర్శులు తమ చుట్టూ తిప్పించుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థా యి అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న స్థానంలో శాశ్వత కార్యదర్శులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.