గాయపడ్డ వ్యక్తి మృతి

28-11-2026 | 08:36pm

నిర్మల్,(విజయక్రాంతి): సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  కడెం మండలం పెద్దూర్ తాండకు చెందిన గుగ్లవత్ ప్రశాంత్ మృతి చెందారు.  జిల్లా కేంద్రంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో నివాసముంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపు వెళ్తుండగా కడ్తాల్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన  గాయాలు కావడంతో  నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిక చికిత్స పొందుతూ మృతి చెందారు.

మరిన్ని వార్తలు