విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయాలి

28-11-2026 | 08:26pm

వర్గల్ గురుకులంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ హైమావతి

గజ్వేల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి(Collector Haimavathi) ఆకాంక్షించారు. వర్గల్ మండలం గౌరారం(Wargal mandal) మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) గురుకుల కళాశాల(Mahatma Jyotiba Phule Gurukula College)లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు.

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీపడి ప్రతిభను చాటాలని కలెక్టర్ సూచించారు.

మరిన్ని వార్తలు