చిరు వ్యాపారులకు చేయూత

28-11-2026 | 08:32pm

రెహబార్ ఫౌండేషన్ అండా దండ

ఖానాపూర్( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణంలోని చిరు వ్యాపారులకు రెహబార్ ఫౌండేషన్(Rehbar Foundation) అండదండగా నిలిచి వారి వ్యాపారాలకు కావలసిన వాహనాలను అందజేశారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని దారుల్ ఉలూమ్ సిద్ధికియా లో ఆర్థిక చేయూత కార్యక్రమం(Financial Assistance Program) నిర్వహించారు.పండ్ల అమ్మకం, ఇతర చిరు వ్యాపారాలు(traders) చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పలువురికి ఫౌండేషన్ ప్రతినిధులు ఉచితంగా 50 తోపుడుబండ్లను, పండ్ల విక్రయ సామాగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మౌలానా మొహమ్మద్  ముసద్దికుల్,ఖాస్ఖి,  మౌలానా షాహిద్, మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు అండగా నిలవడం, వారిని స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సఫా బైతుల్ మాల్ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు