మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
డాక్టర్ రాహుల్
బీసీ, ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే వర్ధంతి వేడుకలు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 28 ( విజయ క్రాంతి ) : సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం(Social Justice) కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం అని బీసీ, ఓబీసీ అసోసియేషన్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) వర్ధంతి వేడుకలు సింగరేణి(Singareni) బీసీ, ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా డాక్టర్ రాహుల్ ముఖ్య అతిధిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవీన్ బ్రాంచ్ సెక్రటరీ నవీన్, జాయింట్ సెక్రటరీ విద్యాసాగర్, ట్రెజరర్ రాణా ప్రతాప్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చంద్రగిరి శంకర్, కమిటీ సభ్యులు రాజేందర్, లక్ష్మణ్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.