శభాష్ కృష్ణవేణి.. ప్రజల హర్షాతీ రేఖలు..!

28-11-2026 | 08:32pm

బెల్లంపల్లి: పూజాప్రతినిధి అంటే అలా ఉండాలి. ఆ వార్డు ఇరుకుగా ఉంటది. మంచిచెడుకూ ఆ విధి నుంచి వాహనం వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజలు నిత్యం పడుతోన్న కష్టాలను ఆమె దగ్గర ఉండి చూస్తున్నారు..గల్లీలో ఇరువైపుల ఇంటి ముందు సిమెంట్ గద్దెలు కట్టుకున్నారు. ఫలితంగా ఆ వీధి నుంచి వాహనాలు వెళ్లగడం అసాధ్యంగా మారింది. ఈ సౌకర్యాన్ని గమనించిన ఆ మహిళా కౌన్సిలర్ తన ఇంటి ముందు ఉన్న కట్టడాన్ని జేసిబి వాహనంతో కూల్చి వేయించి ఆదర్శంగా నిలిచిన నిస్వార్థ ప్రజాప్రతినిధి ఉదంతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మునిపాలిటిలోని 6 వార్డు (ఇంక్లైన్ బస్తీ) చోటు చేసుకున్నది.

బెల్లంపల్లి పట్టణంలోని ఆరోవ వార్డు కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి అందరికీ ఆదర్శంగా నిలిచారు, అరోవ వార్డు లో నీ గల్లిలో అంబులెన్స్ వెళ్లకుండా రోడ్డు కు అడ్డంగా ఉన్న కట్టడాలతో బస్తీ ప్రజల ఇబ్బందులను గుర్తించారు. ప్రజల సౌకర్యం కోసం గల్లి పరిశీలించిన కృష్ణవేణి మొదటగా తన ఇంటి దగ్గర రోడ్డు కు అనుకొని ఉన్న కట్టడనీ తొలగించారు. గల్లీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించడం తో బస్తీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఆమె ఆలోచనకు బస్తీ వాసులు సమ్మతించి చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి మాట్లాడుతూ బస్తీ ప్రజలకు తనపై పెట్టుకున్న నమ్మకాన్నీ వమ్ము చేయకుండా  బస్తీ నీ అభివృద్ధి చేస్తున్నాన్నారు. బస్తీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని బస్తీ వాసులను కోరారు.. ఇలా ఆమె అందరికీ స్ఫూర్తి గా నిలిచారు.

మరిన్ని వార్తలు