భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రజలకు అందుబాటులో ఉండాలి: మధుసూధన్
భిక్కనూర్ (విజయక్రాంతి): కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్(Kamareddy DSP Madhusudhan) శనివారం భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌ను(Bikkannur Police Station) ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఐ జె. నరేష్‌తో కలిసి స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
నేరాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎస్. అనిల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.