హనుమంతుడి లాంగూలాస్త్ర పూజతో ఆధ్యాత్మిక వైభవం

28-11-2026 | 08:47pm

చాకిరిమెట్లలో పోటెత్తిన భక్తజనం!

శివంపేట నవంబర్ 28( విజయక్రాంతి ) : మెదక్ జిల్లా(Medak District) శివంపేట మండలం(Shivampet Mandal) చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాకిరిమెట్ల స్వయంభూ శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో(Swayambhu Sri Sahakara Anjaneya Swamy Temple) శనివారం విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి లాంగూలాస్త్ర పూజతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చారు.

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో హనుమంతుడి లాంగూలానికి (తోకకు) విశేష ప్రాధాన్యత ఉంది. రామాయణంలో లంకాదహనం ఘట్టం హనుమంతుడి లాంగూల మహిమకు ప్రతీకగా నిలుస్తుంది. భక్తుల(devotees) విశ్వాసం ప్రకారం హనుమంతుడి తోక చివరి భాగంలో సకల దేవతల శక్తులు కొలువై ఉంటాయని ప్రతీతి. లాంగూలం దైవిక శక్తికి, దుష్టశక్తుల సంహారానికి, భక్తుల(devotees) రక్షణకు ప్రతీకగా భావిస్తారు.

ఈ పూజ నిర్వహించడం ద్వారా సకల శుభాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.అనంతరం నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది.

ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఆంజనేయ శర్మ, ఈవో సారా శ్రీనివాస్, రాజ్య ప్రభు శర్మ, రమేష్ శర్మ, రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు