మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి
కోదాడ,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి(Jyotirao Phule Death Anniversary)ని శనివారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు పాలూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలూరి సత్యనారాయణ, షేక్ బషీర్, చింతలపాటి శ్రీను, ఈదుల కృష్ణయ్య, కేఎల్ఎన్ ప్రసాద్, చందు నాగేశ్వరరావు, చింతాబాబు, ఏపూరి రాజు, సంగిశెట్టి గోపాల్, పిడతల శ్రీను, కాంపటి శ్రీను, గుండెల సూర్యనారాయణ, కట్టెబోయిన శ్రీను, ఎలమందల నరసయ్య, గంధం పాండు, హరి ప్రసాద్, బాగ్దాద్, బాజాన్, బచ్చలకూరి నాగరాజు, గంధం యాదగిరి, వీరారెడ్డి, సంజీవ్, స్టాలిన్, మాతంగి బసవయ్య, సైదా నాయక్, గుండెపంగు రమేష్, షఫీ, రాజు నాయక్, అలీ భాయ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.