అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
28-11-2026 | 08:51pm
భైంసా,(విజయక్రాంతి): భైంసా మండలం వలెగాం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐకేపీ భవనాల నిర్మాణంలో ముధోల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందంజలో ఉందని, ముఖ్యంగా భైంసా మండలంలో అత్యధిక భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఉపాధి హామీ ఏపీడీ విఠల్, ఐకేపీ ఏపీఎం రమేష్, మాజీ ఎంపీపీ రజాక్, సర్పంచులు సిరం సుష్మారెడ్డి, నాయకులు దిగంబర్, గంగాప్రసాద్, శ్యాంరావు పటేల్, అశోక్, సుధాకర్, వినోద్, మహేందర్, మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్, ఆఖిల్ తదితరులు పాల్గొన్నారు.