బ్యాటరీ వ్యర్థాల్లోనే ఖనిజ సంపద
లిథియం- అయాన్ బ్యాటరీల(Lithium-ion batteries) నుంచి లభించే బ్లాక్మాస్ ఎగుమతులపై 2026 నవంబర్ 10న కేంద్రం నిషేధం విధించింది. పాత బ్యాట రీలను ముక్కలు చేయడం ద్వారా లభించే ఈ పదార్థంలో విలువైన ఖనిజాలుంటాయి. దేశీయంగా వీటిని శుద్ధి చేసి వినియోగించాలన్నది ఈ నిర్ణ యం ఉద్దేశం. అయితే బ్లాక్ మాస్‌ను బ్యాటరీ తయారీకి పనికొచ్చే అధిక స్వచ్ఛత కలిగిన ఖనిజాలుగా మార్చగల సామర్థ్యాన్ని పెంచితేనే ఈ చర్య ఫలిస్తుంది.
పాత బ్యాటరీల్లోని విలువైన ఖనిజాలను తిరిగి వెలికితీయడం ద్వారా బ్యాటరీల దిగుమతులను తగ్గించుకోవడంతోపాటు కొత్త పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకో వచ్చు. విద్యుత్ వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ఇంధన నిల్వ వ్యవస్థల విని యోగం పెరుగుతున్న కొద్దీ లిథి యం- అయాన్ బ్యాటరీలకు డిమాం డ్ వేగంగా పెరుగుతుంది. అయితే వాటి జీవితకాలం ముగిసిన తర్వాత పడేసే బ్యాటరీల్లోనూ లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్, రాగి వంటి ఖనిజాలుంటాయి. వీటిని వినియోగంలోకి తెస్తే వ్యర్థాలను పారిశ్రామిక ముడిసరుకుగా మార్చవచ్చు.
ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి), నీతి ఆయోగ్ సహకారంతో 2026 జనవరిలో రూపొందించిన అధ్యయనం ప్రకారం, భార త్లో లిథియం -అయాన్ బ్యాటరీల డిమాండ్ 2023లో 16గిగా వాట్స్ నుంచి 2035 నాటికి 248 గిగావాట్లకు చేరవచ్చు. అదే సమయంలో రీసైక్లింగ్‌కు అందుబాటులోకి వచ్చే పాత బ్యాటరీలు 19 వేల టన్నుల నుంచి 2.33 లక్షల టన్నులకు పెరగవచ్చని అంచనా. అయితే సేకరణ వ్యవస్థలో తీవ్ర లోపాలున్నాయి. 2025లో సుమారు 36 వేల టన్నుల బ్యాటరీలు వినియోగానికి పనికిరాకుండా పోగా12,600 టన్నులు సేకరణకు నోచుకోలేదు. మరో 18 వేల టన్నులు అనధికారిక వ్యవస్థలోకి వెళ్లాయి. అధికారికంగా సేకరించినవి కేవలం 5,040 టన్నులే. ఫలితంగా గణనీయపరిమాణంలో విలువైన ఖనిజాలు రీసైక్లింగ్‌కు దూరమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి కొన్ని దేశాలకే పరిమితమయ్యాయి. దీనివల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలు సరఫరా అంతరాయాలు, ధరల ఒడిదొడుకులకు గురవుతున్నాయి. పాత బ్యాటరీల నుంచి ఖనిజాలను వెలికితీయడం దేశీయ బ్యాటరీ, విద్యుత్ వాహన పరిశ్రమలకు అదనపు ముడిసరుకును అందిస్తుంది. ఈ దిశగా కేంద్రం 2022లో బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ (ఇపిఆర్) కింద బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్ బాధ్యతను తయారీదారులపై ఉంచింది.
కొత్త బ్యాటరీల్లో రీసైకిల్ పదార్థాల వినియోగానికి కూడా లక్ష్యాలు నిర్దేశించింది. పోర్ట బుల్, విద్యుత్ వాహనాల బ్యాటరీల్లో ఈ వాటా 2027 5 శాతం తో ప్రారంభమై 2030 నాటికి 20 శాతానికి చేరాలి. 2025 సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద రూ.1,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఏటా 2.7 లక్షల టన్నుల రీసైక్లింగ్ సామర్థ్యం, 40 వేల టన్నుల కీలక ఖనిజాల ఉత్పత్తి, రూ.8 వేల కోట్ల పెట్టుబడులు, దాదాపు 70 వేల ఉద్యోగాలు దీని లక్ష్యాలు.
కేవలం బ్లాక్మాస్ తయారీకి కాకుండా, వాస్తవంగా ఖనిజాలను వెలికితీసినప్పుడే ప్రోత్సాహకాలు అందించడం ఈ పథకంలోని ముఖ్యమైన అంశం. అందుకు బ్యా టరీ రీసైక్లింగ్‌ను వ్యర్థాల నిర్వహణ స్థాయి నుంచి పోటీతత్వం కలిగిన పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చే యాలి. హరిత ఇంధన పరివర్తనలో బ్యాటరీల వినియోగం పెంచడం ఎంత ముఖ్యమో, వాటి లోని విలువైన ఖనిజాలను తిరిగి వినియోగంలోకి తేవడం కూడా అంతే ముఖ్యం. పాత బ్యాటరీలను సమర్థంగా సేకరించి, ఖనిజాలను శుద్ధి చేసి తిరిగి అందించగలిగితే భారత్ నిజమైన పారిశ్రామిక సంపదగా మార్చుకోగలదు.