మన్సూరాబాద్ లో ఎండీఎంఏ పట్టివేత
ఎల్బీనగర్, నవంబర్ 28 : ఎల్బీనగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎంఏ రజాక్(LB Nagar District Prohibition and Excise Officer MA Razak) ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల అక్రమ(Drug trafficking) విక్రయాలపై అందిన విశ్వసనీయ సమాచారంతో హయత్నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్(Hayathnagar Prohibition and Excise Station) బృందం శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మన్సూరాబాద్ చెరువు కట్ట(Mansoorabad Lake Bund) వద్ద దాడులు నిర్వహించారు. మన్సూరబాద్(Mansoorabad) కు చెందిన ఎడవల్లి మనోజ్ కుమార్ ఎండిఎంఏ విక్రయిస్తున్నాడు.
ఇతని వద్ద సుమారు రూ. 1,20,000 విలువైన 7.88 గ్రాముల ఎండిఎంఏ, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని విచారించగా తన సహచరుడు మిర్యాల లెనిన్ విక్రయ నిమిత్తం ఈ మాదకద్రవ్యాన్ని తనకు సరఫరా చేశాడని తెలిపారు. ఇద్దరూ కలిసి ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నామని మనోజ్ అంగీకరించాడు. ఈ ఘటనపై ఎన్డిపిఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న సొత్తును సీజ్ చేసినట్లు హయత్నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ రెడ్డి తెలిపారు.
మనోజ్ ను న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న లెనిన్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. సబ్-ఇన్స్పెక్టర్లు జబ్బార్, ఉమారాణి, కానిస్టేబుళ్లు భాస్కర్, అఖిల్, చాణక్య, సుమన్, సాయిరాం, భవాని దాడులలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.