సొసైటీ డైరెక్టర్లకు కంచర్లలో ఘన సన్మానం
28-11-2026 | 11:27pm
భిక్కనూర్ (విజయ క్రాంతి): పెద్దమల్లారెడ్డి సహకార సంఘం డైరెక్టర్లుగా(Peddamallareddy Cooperative Society) ఎన్నికైన కంచర్ల గ్రామానికి చెందిన పెంటల నర్సాగౌడ్, పెంజర్ల శేఖర్‌ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి చెందిన వారు సొసైటీ డైరెక్టర్లుగా ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధికి, సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.