బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ బదిలీ
28-11-2026 | 11:21pm
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్(Bellampalli Sub Collector Manoj) బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్ టి నంబరు 1740 ద్వారా ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ జాబితాలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పేరు ఉన్నది. సబ్ కలెక్టర్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయినట్టు ఆ ఉత్తర్వులో ఉన్నది. 2025 లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా మనోజ్ బదిలీ పై వచ్చారు. ఏడాది న్నర కాలం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా తన సేవలను బెల్లంపల్లి సబ్ డివిజన్ ప్రజలకు అందించారు.