ఇల్లెందు సబ్‌జైల్‌ను తనిఖీ చేసిన జడ్జి
ఖైదీల సమస్యలపై ఆరా..
జైలు పరిసరాలు, వసతుల పరిశీలన
ఇల్లెందు, (విజయక్రాంతి): పట్టణంలోని సబ్‌జైలును శనివారం జడ్జి స్వరూప కాటం(Judge Swarupa Katam) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని పలు రికార్డులను పరిశీలించి, ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలు, వంటగది, శౌచాలయాలను పరిశీలించడంతో పాటు ఖైదీలకు అందిస్తున్న ఆహార మెనూను తనిఖీ చేశారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకొని, మంచి మార్పు దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇందుకోసం జైలులోని లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్‌జైల్ అధికారులు, సిబ్బంది ఉదయ్ కుమార్, భుజరంగరాజు, సాంబ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.