లెగసీ ముగించారు!

29-11-2026 | 05:05am

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్(Intense Political Action) డ్రామా ‘లెగసీ’. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు కేకే మీనన్ శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రలో అలరించనున్నారు. రావు రమేశ్, సచిన్ ఖేడేకర్, మురళీమోహన్, రాజారవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రధాన చిత్రీకరణ పూర్తికావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టిందీ సినిమా. ఈ చిత్రాన్ని 2027 ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు